స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి”

“స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి”

🗞️ మనోరంజని, తెలుగు టైమ్స్ – ఖానాపూర్, అక్టోబర్ 05

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని అన్నారు ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్.

ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్‌లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతోందని ఆయన తెలిపారు. ముఖ్యమైన పథకాలుగా ఆయన పేర్కొన్నవి:

₹2 లక్షల వరకు రుణమాఫీ,

రైతు భరోసా,

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు,

ఉచిత విద్యుత్,

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,

రేషన్ కార్డులు,

ఉద్యోగ నియామకాలు,
మరియు ఇతర అనేక సంక్షేమ పథకాలు.

గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించుతూ, పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని గోవింద్ నాయక్ పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment