ప్రతి ఒక్కరూ బీమాను చేసుకోవాలి
ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ అశోక్ పవార్
ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 16
ప్రతి ఒక్కరు విధిగా బీమాను చేసుకోవాలని ముధోల్ ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ అశోక్ పవార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన ముధోల్లోని రబింద్రా ఉన్నత పాఠశాలలో ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతి సంవత్సరం రూ. 2000 కట్టి ఇన్సూరెన్స్ చేసుకుంటే రూ. 40 లక్షల వరకు భీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. అది తమతో పాటు కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రతి ఒకరు పొదుపును అలవాటు చేసుకోవాలని సూచించారు. పొదుపు ద్వారా భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, చైర్మన్ భీమ్రావు దేశాయ్, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.