ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి: మనోహర్ రెడ్డి
మనోరంజని తెలుగు టైమ్స్ – హైదరాబాద్
మేడ్చల్ జిల్లా కొంపల్లి జయదర్శని కాలనిలోని సాయిబాబా ఆలయంలో గురువారం దత్త జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జడ్పిటిసి ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ— ప్రతి ఒక్కరూ జీవితంలో సన్మార్గంలో పయనం సాగించాలని, ఆధ్యాత్మిక మార్గం మనసుకు ఉల్లాసాన్ని, చైతన్యాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మికతతో జీవితం మరింత సార్థకమవుతుందని అభిప్రాయపడ్డారు.
వేడుకలకు ముందుగా సాయిబాబా ఆలయంలో మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, రాంబాబు, పూజారి, భక్తులు పాల్గొన్నారు.