ప్రతి ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులను వైద్యశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీ చేయాలి

ప్రతి ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులను వైద్యశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీ చేయాలి

ప్రతి ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులను వైద్యశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీ చేయాలి

అనుమతి లేని ఆసుపత్రులను వెంటనే సీజ్ చేయాలి

ఎన్ హెచ్ ఆర్ సి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు మర్రాజు నాగార్జున రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి.

మనోరంజని ప్రతినిధి
మేడ్చల్ జులై 29: – గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న మెడికల్ మాఫియా ఆగడాలు అంతులేకుండా పోతున్నాయని. సామాన్యునికి వైద్యం అందాలంటే చుక్కలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు మర్రపు నాగార్జునరావు అన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల అనుమతి లేని వైద్యంతో ప్రజల జీవితాలతో చెలగాటం మాడుతున్న మెడికల్ మాఫియా రాష్ట్రవ్యాప్తంగా చెలరేగుతున్నదని ఆయన పేర్కొన్నారు. వారు ఏం చదివారో, ఎక్కడ డాక్టర్ కోర్సు చేశారో తెలియని పరిస్థితి నెలకొన్నదని, పెద్ద డాక్టర్లమని మాత్రం బోర్డులు తగిలేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేసే డాక్టర్లు తమ ఉద్యోగం కన్నా ప్రైవేటు క్లినిక్లకే ప్రాధాన్యమిస్తున్నారని, తూతూ మంత్రంగా ఉద్యోగం నిర్వహిస్తున్నారని, అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన అన్నారు. చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు, బ్రూణా హత్యలు విపరీతంగా జరుగుతున్నాయని ఇది జగమెరిగిన సత్యమని అన్నారు. కొన్నిచోట్ల అధికార, ప్రతిపక్ష నాయకులను ప్రసన్నం చేసుకుని వారి కనుసన్నల్లో తమ దందాను ఇంకా విస్తృతం చేసుకుంటున్నారని, కంటికి కానరాని నకిలీ స్కానింగ్ సెంటర్ లు ఎన్నో నడుస్తున్నాయని, ఈ విషయం వైద్య శాఖ అధికారులకు తెలియదా అంటే అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో వైద్యశాఖ అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్డెంట్లు ఎవరు ఏమి చేస్తున్నారో ఎవరికి తెలియదని వారి వృత్తి ధర్మంలో చేయాల్సిన అకస్మాత్తుగా తనిఖీలు, పరిశీలనలు రాష్ట్రంలో చాలా చోట్ల కరువైనాయని ఆయన తెలిపారు. బలమైన సంఘటన జరిగితే తప్ప బయటికి రాని భాగోతాలు కోకొల్లలుగా ఉన్నాయని, వైద్యశాఖలో బలమైన పరిరక్షణ, నిఘా బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఈ విషయంలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రజలు ఆశిస్తున్నారని నాగార్జున రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు సురెడ్డి నవీన్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ లీలా భవాని, ప్రధాన కార్యదర్శి స్వప్న, నాయకులు ఉషారాణి, రవినాయక్, సునీత, శివరాణి, దుర్గ పాండే, సంగీత, మమత, లోకేష్, కళ్యాణ్, అనురాధ, అనూష తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment