బంధాలు వదిలినా… మానవత్వం వదలలేదు
నిరాధార వృద్ధుడికి ఆఖరి గౌరవం అందించిన ‘మే ఐ హెల్ప్ యు’ ఫౌండేషన్
డిసెంబర్ 30 (మనోరంజని తెలుగు టైమ్స్ ):
జమ్మలమడుగు పట్టణంలోని మోర గుడి ప్రాంతానికి చెందిన వద్ది పాములేటి (వృద్ధుడు) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో స్థానికులు ఫోన్ ద్వారా ‘మే ఐ హెల్ప్ యు’ ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్‌ను సంప్రదించారు. సమాచారం అందగానే స్పందించిన ఫౌండేషన్ సభ్యులు హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలను నిర్వహించారు. బంధువులు లేని నిరాధారులకు సహాయం చేయడంలో ‘మే ఐ హెల్ప్ యు’ ఫౌండేషన్ మరోసారి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఈ సేవా కార్యక్రమానికి చేయూతనిచ్చిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్, సుబహన్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్ర, ఈశ్వర్‌వర్ధన్ రెడ్డి, కృప ఆగ్ని షారోన్ ట్రస్ట్ సభ్యులు సుమన్‌బాబు, ప్రసన్నకుమార్ తదితరులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు. సంప్రదింపు నంబర్లు: 📞 82972 53484 📞 91822 44150