- ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల సందర్భంగా వ్యాసరచన పోటీలు
- 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన
- జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక మరియు రాష్ట్ర స్థాయి పోటీల వివరాలు
ముధోల్ మండలంలోని బాసర ఎమ్మార్సీ కార్యాలయంలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. “ప్రత్యామ్నాయ ఇంధన వనరులు” అంశంపై నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంపికైన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు అర్హులు, విజయవంతమైన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
ముధోల్ మండల కేంద్రమైన బాసరలోని ఎమ్మార్సీ కార్యాలయంలో బుధవారం ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, సంక్షేమ, రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు.
“ప్రత్యామ్నాయ ఇంధన వనరులు” అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. మండల విద్యాధికారి జి. మైసాజీ మాట్లాడుతూ, మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు.
జిల్లా స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన వారు డిసెంబర్ మూడవ తేదీన నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని చెప్పారు. విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచన శక్తి అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన అన్నారు.