గాయపడిన శునకానికి ప్రాణం పోసిన ఎస్సై
బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 11
భైంసా పట్టణంలోని జాతీయ రహదారిపై దెబ్బతగిలి, దాహంతో విలవిలలాడుతున్న శునక పిల్ల (కుక్క)ను భైంసా రూరల్ ఎస్సై సుప్రియ, ఎన్ హెచ్ ఆర్ సి చైర్మన్ రాథోడ్ గణపతి గమనించారు. వెంటనే దాన్ని రోడ్డు పక్కకు చేర్చి పరిశీలించారు. దెబ్బలు తగిలినప్పటికీ ముందుగా నీళ్ల బాటిల్ కొని దాహం తీర్చి ప్రాణాన్ని కాపాడారు. ఎస్సై సుప్రియ మానవత్వాన్ని స్థానికులు అభినందించారు.