ఇంద్రకీలాద్రిలో ఐదుగురిపై EO వేటు

ఇంద్రకీలాద్రి ఉద్యోగులపై ఈవో చర్యలు

మనోరంజని ప్రతినిధి

📍 విజయవాడ | ఫిబ్రవరి 07

🔹 ఇంద్రకీలాద్రిపై ఇద్దరు శాశ్వత ఉద్యోగుల సస్పెన్షన్
🔹 ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల శాశ్వత తొలగింపు
🔹 వీఐపీ దర్శనాల ద్వారా వచ్చిన డబ్బును వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసిన ఘటనపై చర్యలు
🔹 ఈవో రామచంద్ర మోహన్ చర్యలు, మరింత లోతుగా దర్యాప్తు కొనసాగింపు

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ దేవస్థానంలో ఉద్యోగుల అక్రమ చర్యలపై ఆలయ ఈవో రామచంద్ర మోహన్ కఠిన చర్యలు తీసుకున్నారు.

ఇటీవల ఆలయ ఆడిటింగ్‌ సమయంలో ఒక ఉద్యోగి వీఐపీ దర్శనాల ద్వారా వచ్చిన డబ్బును తన వ్యక్తిగత ఖాతాలో జమ చేయడాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఈవో ఆ ఉద్యోగిని పోలీసులకు అప్పగించారు.

ఐదుగురిపై కఠిన చర్యలు

➡️ ఇద్దరు శాశ్వత ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
➡️ ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు.

ఈ వ్యవహారంలో ఇంకా పలువురి ప్రమేయం ఉందన్న అనుమానంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

ఈ అంశంపై తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఈవో రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment