తానూర్ మండల వ్యాప్తంగా కురుస్తున్న అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలందరూ తీవ్ర అప్రమత్తంగా ఉండాలని తానూర్ తహసిల్దార్ మహేంద్రనాథ్ హెచ్చరించారు. వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు.
ముఖ్యంగా ఉప్పొంగుతున్న వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని, చిన్నపిల్లలు, పశువుల కాపరులు వాగుల సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలని స్పష్టం చేశారు. పాతబడిన లేదా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసముంటున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే లేదా వరద సహాయం కావలసి వస్తే వెంటనే మండల రెవెన్యూ అధికారులను గానీ, స్థానిక గ్రామ పంచాయతీ అధికారులను గానీ సంప్రదించాలని తహసిల్దార్ తెలియజేశారు.











