నిర్మల్, 30 July
నిర్మల్ జిల్లా పెంబిల్లోని మందపల్లి వద్ద పలేరు వాగులో నీటి కుక్కలు కనిపించాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగు ఉప్పొంగడంతో, వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన నీటి కుక్కలను స్థానికులు ఆసక్తిగా వీక్షించారు. కొందరు వాటిని తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఎగువ ప్రాంతాల నుంచి నీటి కుక్కలు కొట్టుకొచ్చి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నిర్మల్ జిల్లా పెంబిల్లోని మందపల్లి వద్ద పలేరు వాగు ఉప్పొంగింది. వరద ప్రవాహంలో నీటి కుక్కలు కొట్టుకొచ్చాయి. వాగు ప్రవాహంలో ఈదుతూ కనిపించిన నీటి కుక్కలను స్థానికులు ఆసక్తిగా వీక్షించారు. కొందరు వాటి దృశ్యాలను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. వరద ఉద్ధృతి కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి నీటి కుక్కలు ప్రవాహంలో కొట్టుకొచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.












