నిర్మల్, జూలై 4
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్మల్లోని గౌతమ్ మోడల్ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మున్సిపల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొని మొక్కలు నాటారు. స్వచ్ఛమైన, హరిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రియదర్శిని నగర్లోని గౌతమ్ మోడల్ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా స్వచ్ఛమైన, హరితమైన సమాజ నిర్మాణానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జగతి రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మున్సిపల్ కౌన్సిలర్లు కత్తి నరేందర్, లక్కాకుల హరీష్, నాయకులు అజార్, అడప శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.








