బాసర, జూలై 8
రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆదేశాలు, ఆలయ కార్యనిర్వహణ అధికారి అంజనీదేవి సూచనల మేరకు హరితహారం కార్యక్రమంలో భాగంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం మొక్కలు నాటారు. వృక్షాలే మానవ మనుగడకు జీవాధారమని ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి గంగ శ్రీనివాస్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆదేశాలు, ఆలయ కార్యనిర్వహణ అధికారి అంజనీదేవి సూచనల మేరకు హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. వృక్షాలే మానవ మనుగడకు జీవాధారమని ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి గంగ శ్రీనివాస్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి గంగ శ్రీనివాస్ ఆలయ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు నాటే చిన్న మొక్కలే రేపటి మహా వృక్షాలుగా ఎదిగి మానవ మనుగడకు ప్రాణవాయువును అందిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.












