అలరించిన ఆర్ఎంపీల క్రికెట్ పోటీలు

అలరించిన ఆర్ఎంపీల క్రికెట్ పోటీలు

మనోరంజని ( ప్రతినిధి )

భైంసా : జనవరి 18

నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని వానల్పాడ్ గ్రామంలో డివిజన్ స్థాయి ఆర్ఎంపి-పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు అలరించాయి. ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. దీంతో ఉపశమనం పొందేందుకు క్రీడలే ముఖ్యమని పేర్కొన్నారు.

అలరించిన ఆర్ఎంపీల క్రికెట్ పోటీలు

ప్రతి ఒక్కరు తమకు అనువైన సమయంలో ఇష్టమైన క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అన్నారు.

అలరించిన ఆర్ఎంపీల క్రికెట్ పోటీలు

క్రికెట్ పోటీలు చూపరులను విశేషంగా అకట్టుకున్నాయి. డివిజన్లోని వివిధ మండలాల చెందిన ఆర్ఎంపి-పిఎంపీలు క్రికెట్ పోటీల్లో పాల్గొని తమలో అంతర్గతంగా దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పోటీల్లో విజేతగా బైంసా ఆర్ఎంపీ అసోసియేషన్ జట్టు నిలిచింది. క్రీడాకారులకు మెమొంటోలను ముఖ్య అతిథులు బాసర అధ్యక్షుడు బోస్లే నందకిషోర్ పటేల్, డాక్టర్ ముత్యం రెడ్డి, డాక్టర్ నాగేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపి- పిఎంపి డివిజన్ అధ్యక్షులు ఆశమొల్ల మోహన్, జిల్లా అధ్యక్షుడు పోశట్టి, కార్యదర్శి గంధం పోషట్టి, ఆయా మండలాల అధ్యక్షులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment