ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేయాలంటే అర్హతలు
మనోరంజని ప్రతినిధి, సెప్టెంబర్ 29
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేయదలచిన అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు ఇవి:
ఎంపీటీసీ అభ్యర్థుల అర్హతలు:
- అభ్యర్థి సంబంధిత మండల పరిధిలో ఓటరుగా నమోదు అయి ఉండాలి.
- రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా మండలంలో ఎక్కడి నుండైనా పోటీ చేయవచ్చు.
- నామినేషన్ సమయంలో నేర చరిత్ర, అప్పులు, విద్యార్హతల వివరాలకు సంబంధించిన స్వీయ ప్రకటన సమర్పించాలి.
జడ్పీటీసీ అభ్యర్థుల అర్హతలు:
- అభ్యర్థి సంబంధిత జిల్లా పరిధిలో ఓటరుగా నమోదు అయి ఉండాలి.
- రిజర్వేషన్ నిబంధనలకు అనుసరించి జిల్లాలో ఎక్కడి నుండైనా పోటీ చేయవచ్చు.
సాధారణ అర్హతలు (రెండింటికీ):
- కనీస వయస్సు 21 సంవత్సరాలు పూర్తై ఉండాలి.
- గ్రామసేవకులు, రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, డైరెక్టర్లు పోటీ చేయడానికి అనర్హులు.
ఎన్నికల షెడ్యూల్ ముఖ్యాంశాలు:
- అక్టోబర్ 9: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- అక్టోబర్ 23, 27: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
- అక్టోబర్ 31, నవంబర్ 4, 8: పంచాయతీ ఎన్నికలు
- పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు
- నవంబర్ 11: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు అక్టోబర్ 9న వెలువడే నోటిఫికేషన్‌లో తెలియనున్నాయి.