మంచిర్యాల: ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంచిర్యాల కలెక్టర్, ఇతర అధికారులతో ఆమె మాట్లాడారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన విడుదలైనందున, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.