కామారెడ్డిలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి
మనోరంజని ప్రతినిధి కామారెడ్డి సెప్టెంబర్ 29
కామారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 6,39,730 మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో 3,07,508 పురుషులు, 3,32,209 మహిళలు, 13 మంది ఇతరులు ఉన్నారు. 25 ZPTC, 25 MPP, 233 MPTC స్థానాలు, 532 గ్రామ సర్పంచులు, 4,656 వార్డు మెంబర్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,259 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోడ్ జిల్లాలో అమలులోకి వచ్చింది.