కాలనీ అయ్యప్ప సేవా సమితి కార్యవర్గం ఎన్నిక
ఎమ్4 ప్రతినిధి ముధోల్
భైంసా పట్టణంలోని ఏపీ నగర్- శాస్త్రి నగర్-శివాజీ నగర్-గోపాల్ నగర్-సంతోష్ నగర్ కు చెందిన అయ్యప్ప మాలధారణ భక్తులు ఆదివారం గోపాల్ నగర్ కాలనీలోని హనుమాన్ ఆలయంలో కాలనీ అయ్యప్ప సేవాసమితి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఆశమొల్ల మోహన్, ఉపాధ్యక్షులుగా మెంచు శివాజీ, కార్యదర్శిగా దేశెట్టి వెంకటేష్, కోశాధికారిగా కెమ్ శెట్టి సాయిబాబా, గౌరవ సలహా సభ్యులుగా సాయినాథ్, సాయి ప్రసాద్, రాములు, తదితరులు ఎన్నుకోబడ్డారు. కాలనీకి చెందిన అయ్యప్ప మాలధారణ భక్తులు కలకడ వారి నరేష్, మంచాల్ నరేష్, కొట్టుర్వర్ రాజేష్, ఉప్పు నరేందర్, విశాల్, తదితరులు పాల్గొన్నారు.