హెచ్ఐవి-ఎయిడ్స్ నియంత్రణకు కృషి చేయాలి

హెచ్ఐవి-ఎయిడ్స్ నియంత్రణకు కృషి చేయాలి

హెచ్ఐవి-ఎయిడ్స్ నియంత్రణకు కృషి చేయాలి

డాక్టర్ రవీందర్ రెడ్డి

మనోరంజని ( ప్రతినిధి )

నిర్మల్ : డిసెంబర్ 12

జిల్లాలో హెచ్ఐవి-ఎయిడ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు.బుధవారం జిల్లా కేంద్రంలోని షూర్ ఎన్జీవో కార్యాలయంలో ఐ సి టి సి కౌన్సిలర్లు,ల్యాబ్ టెక్నీషియన్లు,ఎన్జీవో సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ హెచ్ఐవి నివారణకు గ్రామీణ,పట్టణ ప్రాంతాలు,ఐ రిస్క్ ప్రాంతాలలో హెచ్ఐవి టెస్టింగ్ క్యాంపులు నిర్వహించాలని ఆయన సూచించారు.ఒకవేళ హెచ్ఐవి నిర్ధారణ అయితే వారికి సంబంధించిన పార్ట్నర్లకు టెస్టులు నిర్వహించాలని తెలిపారు.కొత్త ప్రాంతాలలో హెచ్ఐవి వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.అనంతరం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ నాగరాజు మాట్లాడుతూ హెచ్ఐవి,ఎయిడ్స్ నియంత్రణకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయని తెలిపారు.హెచ్ఐవి వ్యాధిపై పాఠశాలలు,కళాశాలలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఏం&ఈ సతీష్,ఐ సి టి సి కౌన్సిలర్లు ఎల్లేష్,సుదర్శన్,విలాస్, రాంచందర్,శ్రీనివాస్,మహిపాల్,ల్యాబ్ టెక్నీషియన్లు రమేష్ రెడ్డి,ఉమా,షూర్ ఎన్జీవో పీఎం మల్లికార్జున్,సిబ్బంది సోనీ,భాగ్య,సంగీత,
తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment