ఖానాపూర్, 2026-08-05
నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన యోగా పోటీలో కేజీబీవీ దస్తురాబాద్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా యోగా గురువు యుగేందర్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో యోగా విద్యను అభ్యసించడం వలనే తమ ప్రతిభను కనబరిచారని అన్నారు.

మొత్తం ఆరు అవార్డులలో అఖిల ద్వితీయ స్థానం, భవాని తృతీయ స్థానం పొందారని, అలాగే నిర్మల్ రక్ష పాఠశాల నుండి మధు కూడా స్థానాన్ని కైవసం చేసుకున్నారని ఆయన తెలిపారు. గత 20 ఏళ్లుగా యోగా నేర్చుకుని, పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యోగా విద్యను బోధిస్తూ, నేడు జిల్లా స్థాయిలో ఆరుగురు విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచి అవార్డులు పొందడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ విజయం పట్ల విద్యార్థులను, వారి తల్లిదండ్రులను యోగా గురువు యుగేందర్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం, కార్యక్రమ నిర్వాహకులు యోగా గురువు యుగేందర్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.