కోట్గిరి, 20 July
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు, పారదర్శకతను పెంచేందుకు తెలంగాణ పాఠశాల విద్యా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్యూషన్ ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో, వెబ్సైట్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించింది. 2023-24, 24-25 ఆడిట్ రిపోర్టులను జులై 30లోపు విద్యా శాఖ సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది.
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు, పారదర్శకతను పెంచేందుకు పాఠశాల విద్యా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ట్యూషన్ ఫీజు వివరాలను కచ్చితంగా నోటీసు బోర్డుల్లో, వెబ్సైట్లో ఉంచాలని పాఠశాలలను ఆదేశించింది. అలాగే 2023-24, 24-25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ రిపోర్టులను జులై 30లోపు విద్యా శాఖ సైట్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ గడువులోగా అప్లోడ్ చేయని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కాగా, ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.












