నిర్మల్, జూలై 22
ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి ఆటంకం కలిగించేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.25ను వెంటనే సవరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జెడ్పీహెచ్ఎస్ఎస్ (ZPSS) కల్లూరులో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం సందర్భంగా వారు నిరసన తెలిపారు.
ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి విఘాతం కలిగించేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.25ను వెంటనే సవరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ఎస్ (ZPSS) కల్లూరులో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జీవో నెం.25 ప్రకారం విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకాన్ని ఈ విధంగా ప్రతిపాదించాలని వివరించారు. వారి ప్రతిపాదనల ప్రకారం:
0 నుంచి 20 మంది విద్యార్థులు ఉంటే 2 మంది SGTలు. 21 నుంచి 40 మంది విద్యార్థులు ఉంటే 3 మంది SGTలు. 41 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే ఒక తరగతికి ఒక టీచర్. 60 మందికి పైగా ఉంటే ఒక PSHMతో పాటు తరగతికి ఒక టీచర్. 80 మందికి పైగా ఉంటే అదనంగా ఒక PET. రేషియోను 1:30 నుంచి 1:20 కి తగ్గించాలి.
ఈ నిబంధనలు ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి విఘాతం కలిగిస్తాయని, వాటిని వెంటనే సవరించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసనను వ్యక్తం చేశారు.












