आంధ్రప్రదేశ్, 22 July
ఢిల్లీలో నీట్ పరీక్ష అంశంపై నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జిని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకుడు మేడా శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను గాయపరిచిన పాలకులు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో నీట్ పరీక్ష అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకుడు మేడా శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను గాయపరిచిన పాలకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో తమ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలపై ప్రశ్నించిన విద్యార్థులపై బలప్రయోగం చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై దాడులు జరగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలని, విద్యార్థుల భవిష్యత్తుకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. యువత ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా నిలుస్తుందని మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు.












