(కేజీబీవీ) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో నాబార్డ్ (NABARD) నిధుల ద్వారా నిర్మించిన అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలను భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శిందే ఆనంద్‌రావు పటేల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు యూనిఫామ్‌లను కూడా పంపిణీ చేశారు.
తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో నాబార్డ్ (NABARD) నిధుల ద్వారా నిర్మించిన అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలను భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శిందే ఆనంద్‌రావు పటేల్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా రూ.56 లక్షల వ్యయంతో నిర్మించిన మొదటి అంతస్తులోని అదనపు తరగతి గదులను, రూ.42.12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అదనపు మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు.
ఈ అభివృద్ధి పనులు విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంలో కీలకంగా ఉపయోగపడతాయని శిందే ఆనంద్‌రావు పటేల్ ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.












