నేటి సమాజంలో, ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలు చాలా అవసరమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. మిర్యాలగూడలో విద్యార్థుల కోసం నిర్వహించిన ఉచిత కరాటే శిక్షణ శిబిరం ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
అమరవీరుల స్థూపం వద్ద కరాటే మాస్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో, వివిధ స్థాయిలు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ బెల్టులు, సర్టిఫికెట్లను అందజేశారు.
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ, విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీయడానికి మాస్టర్ రామకృష్ణ అందించిన ఉచిత శిక్షణను ఎమ్మెల్యే ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆయన ఆత్మరక్షణ విద్యల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కరాటే అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.












