సిద్దిపేట, 20 July
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్లో పీడీ, ప్రిన్సిపాల్ వేధింపులపై ఓ విద్యార్థిని తీవ్రంగా స్పందించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. స్కూల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్లో పీడీ, ప్రిన్సిపాల్ వేధింపులపై ఓ విద్యార్థిని తీవ్రంగా స్పందించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 'పిల్లల్ని ఎలా చూసుకోవాలి? మీ ఇంట్లో పిల్లలు లేరా? అసలు ఇది స్కూల్ అంటారా?' అని ఆమె ప్రశ్నిస్తూ ప్రిన్సిపల్‌ను కడిగి పారేసింది.
ఈ నేపథ్యంలో, స్కూల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగారు. పీడీ, ప్రిన్సిపాల్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగి, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.



