సర్పంచ్ చొరవతో లైబ్రరీ, స్పోర్ట్స్ గదుల ఏర్పాటు.. ప్రారంభించిన జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి
మిర్యాలగూడ జులై 31 (మనోరంజని తెలుగు టైమ్స్)
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామపంచాయతీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (హైస్కూల్) నిరుపయోగంగా ఉన్న గదులను విద్యార్థుల కోసం అందుబాటులో తెచ్చేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఇచ్చిన హామీ మేరకు లైబ్రరీ గదిని స్పోర్ట్స్ గదిని అన్ని హంగులతో ముస్తాబు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయిమిర్యాలగూడ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాద్గార్ పల్లి లో శుక్రవారం లైబ్రరీ, స్పోర్ట్స్ గదులను ఆ గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, హై స్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు లావూరి బాలుతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా పాఠశాల గ్రౌండ్‌కు అవసరమైన మట్టిని తెప్పించి చదును చేయించడం ద్వారా విద్యార్థులకు మెరుగైన క్రీడా వాతావరణాన్ని కల్పించడం మీ విద్యాపట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనం ఉపాధ్యాయులు గ్రామస్తులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థుల క్రీడా అభివృద్ధికిఅవసరమైన స్పోర్ట్స్ మెటీరియల్‌ను దాతృత్వంగా అందించిన గాయం ఉపేందర్ రెడ్డి, యాద్గార్పల్లి పాఠశాల విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.విద్య కోసం చేసే ప్రతి సేవ సమాజ భవిష్యత్తుకు వేసే బలమైన పునాది అని,గ్రామాభివృద్ధి, విద్యాభివృద్ధి కోసం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న సేవలు ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ బాలు నేతృత్వంలో ఉపాధ్యాయ బృందం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గాయం ఉపేందర్ రెడ్డిలకు శాలువలు తో ఘనంగాసన్మానించారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లువెంకన్న ,రామకృష్ణ సురేష్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












