Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
కామారెడ్డి జిల్లా సదాశివానగర్ మండలం మరకల గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు 'మై భారత్ పోర్టల్' ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో పలు విభాగాల్లో విజేతలుగా నిలిచి బహుమతులు కైవసం చేసుకున్నారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల లో భాగంగా జరిగిన ఈ పోటీల్లో విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచారు.
కామారెడ్డి జిల్లా సదాశివానగర్ మండలం మరకల గ్రామంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు 'మై భారత్ పోర్టల్' ఆధ్వర్యంలో, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల లో భాగంగా నిర్వహించిన కామారెడ్డి జిల్లా స్థాయి పోటీలలో విశిష్ట ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు.
డ్యాన్స్ లో శ్రావ్య అండ్ గ్రూప్ ప్రథమ బహుమతి, నినాద రచన లో కె. మానస ద్వితీయ, భార్గవి తృతీయ బహుమతులు, కవితా రచన లో ప్రశర్ష ద్వితీయ, వక్తృత్వ పోటీ లో రాజ భవాని ద్వితీయ, గాన పోటీ లో కె. సుప్రియ తృతీయ బహుమతులు సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. శోభారాణి విజేతలను అభినందించి, ఇలాంటి పోటీలలో మరింత ఉత్సాహంగా పాల్గొని కళాశాలకు మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణవేణి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ చంద్రకళ, సభ్యులు మౌనిక, యువరాణి, కృష్ణవేణి, అలాగే కళాశాల అధ్యాపకులు విజేతలను అభినందిస్తూ వారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.












