బైంసా పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని గాయత్రి యజ్ఞం నిర్వహించి, విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు.
గుజిరిగల్లి గ్రామంలో గల శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో మంగళవారం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గాయత్రి యజ్ఞం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాన్ని విద్యార్థులు అందంగా అలంకరించారు.
నూతన విద్యార్థులకు పాఠశాల ఆచార్యులు, కమిటీ సభ్యులు సాంప్రదాయబద్ధంగా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి పురస్తు గోపాల్ కిషన్, పాఠశాల సమితి అధ్యక్షుడు శివకుమార్ బచ్చువార్, సభ్యుడు తోట రాము, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు పేరుగు నవీన్ తదితరులు హాజరయ్యారు.
పాల్గొన్న నాయకులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నూతన విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించి, ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం ఆటపాటలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు.
ఈ విద్యా సంవత్సరారంభోత్సవ కార్యక్రమంలో పాఠశాల ఆచార్యులు, కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.











