రూపారెడ్డి హత్యకు నిరసనగా "ట్రస్మా" ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. పాఠశాలలు బంద్...
మిర్యాలగూడ ఆగస్టు 21 (మనోరంజని తెలుగు టైమ్స్)
కొండమల్లేపల్లి లోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని
హత్యను నిరసిస్తూ తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం
(ట్రస్మా) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని పాఠశాలలు సంపూర్ణంగా బంద్ పాటించాయి. ట్రస్మా మిర్యాలగూడ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయినీలు, ఉపాధ్యాయులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి, ఎన్ఎస్పి క్యాంపు నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఇంచార్జ్ డీఎస్పీ రవి, సబ్ కలెక్టర్ కార్యాలయ డి ఏ ఓ శ్రీనివాస్ శర్మకు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు.ట్రస్మా జిల్లా, డివిజన్, మిర్యాలగూడ కమిటీ నాయకులు మాట్లాడుతూ చదువు నేర్పే ఉపాధ్యాయులను దుర్మార్గంగా 27 కత్తిపోట్లతో రూపారెడ్డి నిహత్య చేయడం సహించరాని నేరమన్నారు. విద్యార్థులలో నేర ప్రవృత్తి పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అనైతిక కార్యక్రమాలు నివారణకు కౌన్సిలర్లను నియమించి నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక స్పృహ ఉండే విషయాలు నేర్పించాలని అందుకు ఒక పిరియడ్ కేటాయించాలని సూచించారు. విద్యార్థుల్లో నేర ప్రవృత్తి పెరగడానికి గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత మత్తు పదార్థాలు కారణాలు అని వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సినిమాలు ,సీరియల్లో వచ్చే వాటితో పాటు మొబైల్ ఫోన్లు విద్యార్థులు అత్యధికంగా వాడడం వల్ల నైతికత, సామాజిక స్పృహ కోల్పోతున్నారని అన్నారు. సెల్ ఫోన్ వాడకంపై కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలలోపు విద్యార్థులకు నిషేధం విధించాలని కోరారు. రూప రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావడం కాకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేర ప్రవృత్తి నివారణ, అసాంఘిక కార్యక్రమాల నివారణ కోసం పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాన్ని చేర్చాలని సూచించారు.అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని
కోరారు.
కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల
ట్రాస్మా జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి, శ్రీ రామకవచం నాగరాజు, వంగాల నిరంజన్ రెడ్డి, కుందూరు శ్యాంసుందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి
కందాల శ్రీనివాసచారి, వరప్రసాద్, అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఓరుగంటి శ్యాంసుందర్, పోలగాని సాయి శ్రీనివాస్,చార్లెస్, కేకే జయరాజన్, రెడబోతు నర్సిరెడ్డి, మహమ్మద్ ఖాన్, అహ్మద్, అయ్యన్న,
శ్రీపతి శ్రీనివాస్, పెంట రాజు, కందుల మధుసూదన్ రెడ్డి,రియాజ్ మోహినుద్దీన్, బోనాల రాంరెడ్డి,సైదులు,సోమయ్య, శ్రీధర్ రెడ్డి, నీలిమ,చంద్రకళ, ఉమ,అనిత, శ్రీకాంత్, వెంకట్,నర్సిరెడ్డి, చార్లెస్, ఖలీం, సురేందర్ రెడ్డి,పరమేశ్ ,ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, కరస్పాండెంట్లు, భారీ సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












