నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ జిల్లా కార్యదర్శి జే. లక్ష్మణ్ తన సొంత ఖర్చులతో 55 జతల షూలను అందజేశారు.
విద్యార్థుల అవసరాలను గుర్తించి షూలను అందించడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులకు 55 జతల షూలను సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి అందించిన జే. లక్ష్మణ్ సేవాభావాన్ని అభినందించారు.
విద్యార్థులకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నామని తెలిపారు.
విద్యార్థులకు అవసరమైన సహాయం అందించడం ద్వారా సమాజంలో సేవా స్ఫూర్తిని పెంపొందించేందుకు లక్ష్మణ్ చేస్తున్న కృషిని పాఠశాల సిబ్బంది అభినందించారు.












