దస్తూరాబాద్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 14
నిర్మల్ జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా దస్తూరాబాద్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పదో తరగతి విద్యార్థినుల తరగతి గదిలోకి వెళ్లి ఉపాధ్యాయుడిలా పాఠాలు బోధించారు. విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించి, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా దస్తూరాబాద్ మండలంలో పర్యటించి స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థినుల తరగతి గదికి వెళ్లిన ఆయన కొంతసేపు ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించారు.
అనంతరం విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించి పలు ప్రశ్నలు అడుగుతూ వారి అభ్యసన సామర్థ్యం, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థినులకు సూచించారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఏ ఒక్క విద్యార్థి కూడా మధ్యలో చదువును నిలిపివేయకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి విద్యను పూర్తిచేసేలా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న తదితరులు పాల్గొన్నారు.












