మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 10
ుప్కప్రభుత్వఉ్తపఠశలలో2025–26విద్యవత్రికిగుపదోతరగతిపరీక్షలోఅత్యుత్తప్రతిభకబరిచివిద్యర్థులకుకపట్ర ట్ ఆధ్వర్యలో ఘ ్వర్యలోఘ ్చేిగదుబహుతులుఅదజేశరు.రష్ట్రుఖ్యచరకిషర్డ.జి.చద్రశేఖర్రెడ్డిఈకర్యక్రికిుఖ్యఅతిథిగహజరయ్యరు.
ముప్కాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కల్పన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి నగదు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.
కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగారాం, కల్పన ట్రస్ట్ అధ్యక్షుడు జి. మహిపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ చిన్నయ్య, వార్డు సభ్యుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కూడా విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలను కల్పన ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.











