కుంటాల, 2026-09-01
కుంటాల మండల కేంద్రంలోని ఆదర్శ బాలికల వసతి గృహాన్ని ఎంపీడీవో వెంకటరాజు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతిగృహంలోని పరిసరాలు, విద్యార్థుల వసతి సౌకర్యాలు, వంటగది, భోజన నాణ్యతను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు.
కుంటాల మండల కేంద్రంలోని ఆదర్శ బాలికల వసతి గృహాన్ని ఎంపీడీవో వెంకటరాజు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతిగృహంలోని పరిసరాలు, విద్యార్థుల వసతి సౌకర్యాలు, వంటగది, భోజన నాణ్యతను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడంలో రాజీ పడొద్దని సిబ్బందికి సూచించారు.
అనంతరం వసతిగృహంలోని స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి, రికార్డుల్లోని వివరాలను అందుబాటులో ఉన్న నిల్వలతో సరిపోల్చి చూశారు. వర్షాకాలం నేపథ్యంలో బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న భోజనం, వసతి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. బాలికలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని ఎంపీడీవో వెంకటరాజు సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో శోభన, వార్డెన్ సాయి ప్రద, వసతిగృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







