రాధాకృష్ణన్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని, సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం ఎప్పటికీ రాదని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, డి.ఎస్.పి మధుసూదన్, ఫార్మా కౌన్సిల్ సభ్యులు చిలువేరి మారుతి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి ఆలయంలో డాక్టర్ సర్వేపల్లి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
*దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది* *డాక్టర్ సర్వేపల్లి జిల్లా ఉపాధ్యాయ పురస్కారాల కార్యక్రమం* *కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ల ఆధ్వర్యంలో* కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి ఆలయంలో డాక్టర్ సర్వేపల్లి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్,తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యులు చిలువేరి మారుతి లు మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని,సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నటికీ రావని అన్నారు. విద్యార్థులకు పుస్తక జ్ఞానాన్ని కాకుండా సామాజిక అంశాల పైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత నేటితరం ఉపాధ్యాయుల పైన ఉన్నదని ఆ దిశగా విద్యార్థులకు మార్గదర్శకం చేయాలని అన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న 16 మంది ఉపాధ్యాయులకు ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమ సమన్వయకర్త ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని పేద మధ్యతరగతి విద్యార్థులు నాణ్యమైన విద్యను అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయుల పైన ఎంతగానో ఉన్నదని అన్నారు.ఉపాధ్యాయుడి మార్గదర్శకత్వమే విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుందని నిస్వార్ధంగా సేవ చేసే వారికి అవార్డులు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్,కామారెడ్డి రక్తదాతల సమూహ గౌరవ అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్,అధ్యక్షులు జమీల్ అమ్మద్,ఐవిఎఫ్ జిల్లా విభాగం నాయకులు దొంతి సుధాకర్,కోశాధికారి కస్వ వెంకన్న,ఎర్రం విజయ్, బుక్క రజని,గజవాడ అన్నపూర్ణ,పర్ష వెంకటరమణ,ఎల్లంకి సుదర్శన్,భీమ్ రాజ్ లు పాల్గొనడం జరిగింది.












