ఇంటర్మీడియట్ పరీక్షలలో స్టేట్ ర్యాంకు సాధించిన విద్యార్థిని మృధులను జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా కార్యదర్శి షేక్ గౌస్ మాట్లాడుతూ, విద్యార్థిని సాధించిన విజయం ఇందూరు ప్రజలకు గర్వకారణమని, ఇది ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో, విద్యార్థిని కృషిని, అంకితభావాన్ని కొనియాడారు.
ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, విద్యార్థిని మృధులకు మిఠాయి తినిపించి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఆమె కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు జె. లక్ష్మణ్‌తో పాటు కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. విద్యార్థిని భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.











