మిర్యాలగూడ పట్టణంలోని డౌహిల్ హైస్కూల్, ఇటీవల ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించి, అత్యుత్తమ మార్కులతో పలువురు విద్యార్థులు ర్యాంకులు సాధించడం ద్వారా పాఠశాల కీర్తిని పెంచింది.
బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాలలో డౌహిల్ హైస్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. పాఠశాల కరస్పాండెంట్ పోలగాని సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా తమ పాఠశాల 100 శాతం ఉత్తీర్ణతతో అగ్రగామిగా కొనసాగుతోందని తెలిపారు.
ఎస్. శృతి 553 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా, జి. సిరి 544, సిహెచ్. మానస 541, ఎండి. నఫీసా 527, ఎస్.కె. బిలాల్ 526, కె. శివ సాయి 524, కే. మనీ 516, ఎం. సాత్విక్ 503 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
విజయవంతమైన విద్యార్థులను కరస్పాండెంట్ సాయి శ్రీనివాస్ అభినందించి, వారికి స్వీట్లు తినిపించారు. ఈ విజయం వెనుక విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కీలకమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీకాంత్ బాబు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.












