శనివారం (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
ముథోల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను శనివారం డివిజనల్ పంచాయతీ అధికారి బట్టేకర్ లక్ష్మణ్ సందర్శించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆయన పాఠశాల సిబ్బందిని ఆదేశించారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని డివిజనల్ పంచాయతీ అధికారి బట్టేకర్ లక్ష్మణ్ అన్నారు. ముథోల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను శనివారం ఆయన సందర్శించి పాఠశాల నిర్వహణ, విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, వంట ప్రక్రియ, భోజనం వడ్డిస్తున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారమే విద్యార్థినులకు పరిశుభ్రమైన, పోషక విలువలు కలిగిన నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు గుర్తించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం విద్యార్థినులతో మమేకమై భోజనం నాణ్యత, వసతి సౌకర్యాలు, విద్యాభ్యాసం తదితర అంశాలపై ఆరా తీశారు. విద్యార్థినుల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ప్రతిరోజూ కచ్చితంగా అమలు చేయాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.
పాఠశాల ఆవరణతో పాటు వంటశాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, ఆహార తయారీ, నిల్వ, వడ్డింపులో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఆయన వెంట కేజీబీవీ ప్రత్యేక అధికారి ఫర్హాత్ బేగం, ఉపాధ్యాయులు, తదితరులున్నారు.












