జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, దేవోల్ల జోయ్ అభిగేల్ను కలెక్టరేట్లో ప్రత్యేకంగా అభినందించారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన విద్యార్థిని దేవోల్ల జోయ్ అభిగేల్ను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్న వయస్సులోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి నిర్మల్ జిల్లా పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఆమె విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులు, గురువులను అభినందించారు.
మే 29న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి విప్లరి ఆడిటోరియంలో నిర్వహించిన 'గిన్నిస్ అచీవర్స్ మీట్'లో గిన్నిస్ రికార్డ్ సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ అంతర్జాతీయ రికార్డు కార్యక్రమం ఫిబ్రవరి 02న హైదరాబాద్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల పర్యవేక్షణలో నిర్వహించబడింది.












