బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 21
బోథ్ పట్టణంలోని వాసవి ప్రైమరీ స్కూల్లో వరలక్ష్మీ వ్రతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మీ వ్రతం విశిష్టతను వివరించారు.
బోథ్ పట్టణంలోని వాసవి ప్రైమరీ స్కూల్లో వరలక్ష్మీ వ్రతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి గంగయ్య మాట్లాడుతూ, వరలక్ష్మీ వ్రతం విశిష్టతను వివరించారు. వరలక్ష్మిని పూజించడం అష్టలక్ష్మి పూజలకు సమానమని, తద్వారా సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటి అష్టైశ్వర్యాలు లభిస్తాయని విద్యార్థులకు తెలియజేశారు.
సాంప్రదాయ వాయనం
ఈ కార్యక్రమంలో పాఠశాల మహిళా ఉపాధ్యాయులు, మహిళా పోషకులకు సాంప్రదాయ పద్ధతిలో వాయనం అందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోషకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












