బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 21
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తగిన భద్రత కల్పించాలని మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థల ఉద్యోగులు కోరారు. ఈ మేరకు వారు మండల కేంద్రంలో ర్యాలీగా తరలివచ్చి, స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తగిన భద్రత కల్పించాలని మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థల ఉద్యోగులు కోరారు. ఈ మేరకు వారు మండల కేంద్రంలో ర్యాలీగా తరలివచ్చి, స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జూనియర్ అసిస్టెంట్ భీమ్రావుకు వినతి పత్రం అందజేశారు.
నిష్పక్షపాత విచారణకు డిమాండ్
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ప్రిన్సిపాల్ రూప రెడ్డి హత్య కేసును ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనేక విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులపై దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు విజ్ఞప్తి
విద్యాసంస్థల యాజమాన్యాలు, పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఉద్యోగులకు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ వేదం, యూటర్న్, నాగభూషణం, సన్ షైన్ విద్యాసంస్థల యజమాన్యాలు పాల్గొన్నాయి.












