తెలంగాణ సారస్వత పరిషత్ ప్రచురించిన "బాలసారస్వతం" కథా సంకలనంలో బోరిగాం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రచయిత కొండూరు పోతన్న రచించిన "కొడుకు మాట" కథ ఎంపికైంది. ఈ కథ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన 180 కథలలోంచి 70 కథలను ఎంపిక చేసి "బాలసారస్వతం" పేరుతో సంకలనంగా విడుదల చేశారు. ఈ ఎంపికలో కొండూరు పోతన్న కథ చోటు చేసుకోవడం విశేషం.
"కొడుకు మాట" కథలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రమాదాలు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. కథనం ప్రశంసనీయంగా ఉందని పలువురు పేర్కొన్నారు.
కొండూరు పోతన్న ఇంతకుముందు "కొండూరు గుండె చప్పుడు", "సీస పద్య శతకం", "నర శతకం" వంటి రచనలు చేశారు. విద్యార్థుల కథా సంపుటాలైన "అంకురాలు-1", "అంకురాలు-2" లను కూడా వారి సంపాదకత్వంలో వెలువరించారు.
ఈ సందర్భంగా పీఏసీఎస్ ఆలూర్ చైర్మన్ ఎలిపెద్ది మాణిక్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు రాజకుమార్ రెడ్డి, డా. నారాయణ మీర రాజు తదితరులు కొండూరు పోతన్నను అభినందించారు.












