లోకేశ్వరం శివాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిష్ఠా మహోత్సవం

లోకేశ్వరం శివాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిష్ఠా మహోత్సవం

లోకేశ్వరం శివాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిష్ఠా మహోత్సవం

కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారుడు – భక్తులకు అన్నదానం

మనోరంజని తెలుగు టైమ్స్ లోకేశ్వరం, నవంబర్ 16:

లోకేశ్వరం శివాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిష్ఠా మహోత్సవం

లోకేశ్వరం శివాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిష్ఠా మహోత్సవంలోకేశ్వరం శివాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిష్ఠా మహోత్సవం

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని లోకేశ్వర శివాలయంలో ఆదివారం భక్తి సంద్రంగా శ్రీ అష్ట నాగ కాలభైరవ సమేత శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్చారణలతో మార్మోగింది.
ఈ మహోత్సవానికి ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ పెద్ద కుమారుడు డాక్టర్ సతీష్ పవార్, మేనల్లుడు శివాజీ పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఇద్దరూ వేదపండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. తదుపరి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ సతీష్ పవార్ ప్రారంభించారు. భక్తులకు శ్రద్ధతో అన్నప్రసాదం అందజేశారు. మహోత్సవాన్ని ఆనందంగా ఆస్వాదించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు, బీజేపీ నాయకులు, స్థానిక గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికత, సామాజిక సేవ, ప్రజా భాగస్వామ్యంతో మహోత్సవం విజయవంతంగా ముగిసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment