దుర్గమ్మకు కన్నులపండువగా పూజలు
మనోరంజని ప్రతినిధి, భైంసా సెప్టెంబర్ 26
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తుల భక్తి నిండిన పూజలతో దుర్గమ్మ కన్నులపండువగా అలరించింది. భైంసా మండలంలోని మాంజ్రి గ్రామంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన అమ్మవారి హారతి కార్యక్రమానికి భక్తులు పోటెత్తారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం, సాయంత్రం భక్తి గీతాల మధ్య హారతులు కొనసాగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదం పంపిణీ చేశారు.