భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి నిమజ్జనం

భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి నిమజ్జనం

భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి నిమజ్జనం

అమ్మవారి సన్నిధిలో కలశాన్ని వశం చేసుకున్న బట్టు సవిత శ్రీధర్ రాజ్

మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – నిజామాబాద్, అక్టోబర్ 04

భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి నిమజ్జనం

నిజామాబాద్ నగరంలో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వివేకానంద కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ మాత దుర్గాదేవి సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పురోహితులు చంద్రశేఖర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సమితి అధ్యక్షులు అట్లూరి మురళీకృష్ణ మాట్లాడుతూ, “దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు, హారతులు నిర్వహించాం” అని తెలిపారు. ఉదయం జరిగిన వేలంపాటలో దుర్గాదేవి కలశం బట్టు శ్రీధర్ రాజ్ రూ.18,500కు వశం చేసుకున్నారు. అనంతరం అమ్మవారికి సేవ చేసిన పలువురిని ఘనంగా సత్కరించారు.

గౌతమి వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి మాట్లాడుతూ, “వివేకానంద కాలనీ నిజామాబాద్‌లో నంబర్ వన్ కాలనీగా నిలవాలని, అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని” ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఆమెను ఘనంగా సన్మానించారు.

ఎల్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాలతో పాటు భక్తిమార్గంలో ముందుండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చెరుకు లక్ష్మణ్ గౌడ్, కోశాధికారి కోనేరు గంగాధర్, గౌరవ అధ్యక్షులు కిషన్, గురుమంచి శేఖర్, గురుమంచి మాధవి, గురుమంచి భార్గవ్, గురుమంచి రాఘవ, శ్యామ్, ప్రభాకర్, శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

భక్తుల ఉత్సాహం, అమ్మవారి జయజయధ్వానాలతో కాలనీ అంతటా పండుగ వాతావరణం నెలకొంది.

 
 

Join WhatsApp

Join Now

Leave a Comment