మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
డిఆర్డిఏ పిడి విజయలక్ష్మి
మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ ప్రతినిధి అక్టోబర్ 16
ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని వ్యాపారంలో సైతం రాణించాలని డి ఆర్ డి ఓ విజయలక్ష్మి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) సౌజన్యంతో, నిర్మల్ మండల సమాఖ్య ఆధ్వర్యంలో ధాన్యశ్రీ మహిళా ఉత్పత్తిదారుల సంస్థ (FPC) రూపొందించిన సూక్ష్మ హరిత ఆహారం (Micro Greens) తయారీ, మార్కెటింగ్ కార్యక్రమం అభినందనీయంగా సాగుతోంది. సుమారు 1500 మంది మహిళా రైతుల సభ్యత్వంతో ఉన్న ఈ ధాన్యశ్రీ సంస్థ, మహిళా రైతులను వ్యాపారవేత్తలుగా ఎదగే దిశగా ప్రోత్సహిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులను నాణ్యమైన సేంద్రియ పద్ధతుల్లో విలువ ఆధారిత ఉత్పత్తులుగా తయారుచేసి మార్కెట్ చేయడం ద్వారా సంస్థ మరింత లాభాలు సాధించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఉదయపు నడకలో, WALA సభ్యులకు సూక్ష్మ హరిత ఆహారం ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. ప్రతిరోజు ఆహారంలో మైక్రో గ్రీన్స్‌ను చేర్చడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉండడం, రక్తశుద్ధి, హిమోగ్లోబిన్ పెరుగుదలతో పాటు శరీరానికి అవసరమైన ఫైబర్, ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. మైక్రో గ్రీన్స్ వినియోగం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డిఆర్డిఓ తెలిపారు. మహిళా రైతులు సేంద్రియ ఉత్పత్తుల ద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించడం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు