ప్రజలకోసం సమయాన్ని వెచ్చిస్తున్న ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ సతీష్ పవార్
దేశంలోనే పేరుగాంచిన ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ సతీష్ పవార్
ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పెద్ద కుమారుడు
భైంసా పర్యటన సందర్భంగా క్యాన్సర్ బాధితులకు వైద్య సేవలు
ప్రజలకోసం సమయాన్ని వెచ్చించడం అభినందనీయమైన సేవ
మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా ప్రతినిధి అక్టోబర్ 21
దేశవ్యాప్తంగా అంకాలజీ రంగంలో విశేష గుర్తింపు పొందిన డాక్టర్ సతీష్ పవార్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పెద్ద కుమారుడు. తన తండ్రి బాటలోనే ప్రజాసేవ పట్ల అంకితభావంతో ముందుకు సాగుతున్నారు. పండుగ సందర్భంగా భైంసా నగరానికి వచ్చిన ఆయనను క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు పెద్ద సంఖ్యలో కలుసుకున్నారు.
వారి సమస్యలను ఓర్పుగా విని, అవసరమైన వైద్య సలహాలు, చికిత్సా సూచనలు అందించారు. తన కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని ప్రజల ఆరోగ్యానికి వెచ్చిస్తున్న ఆయన సేవా తపన అందరికీ ఆదర్శం. వైద్య సేవలను మానవతా దృక్పథంతో అందిస్తున్న డాక్టర్ సతీష్ పవార్ భైంసా ప్రజల్లో కృతజ్ఞతాభావాన్ని రేకెత్తించారు.