డాక్టర్ సాప పండరి సేవలు అభినందనీయం:-
మార్చ్ఈ రోజు హైదరాబాదు పట్టణంలోని రిగల్స్ హోటల్ నందు జరిగిన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధుల శిక్షణ శిబిరంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ డాక్టర్ సాప పండరి చేస్తున్న సేవలు అమోఘమైనవని, అద్భుతమైనవని ప్రతి ఒక్క ప్రతినిధి సాప పండరిని ఆదర్శంగా తీసుకొని వెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రెటరీ మామిడాల మనోహర్, సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ గంప హనుమా గౌడ్, ఉభయ తెలుగు రాష్ట్రాల ఇన్చార్జి చైర్మన్ గాజుల వేణు కుమార్, తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బి నవీన్ కుమార్ పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు