కుబీర్ గ్రామంలో అంగరంగ వైభవంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి ఉత్సవాలు

కుబీర్ గ్రామంలో అంగరంగ వైభవంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి ఉత్సవాలు-

ఈ రోజు నిర్మల్ జిల్లాలోని కుబీర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ చైర్మన్ డాక్టర్ సాప పండరి మాట్లాడుతూ “శోధించు-సమీకరించు-పోరాడు అని మూడు అంశాలపై మనము పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం పట్ల, మనకు కలిగి ఉన్న హక్కులను తెలుసుకొని సమాజంలో కులమత తేడాలు లేకుండా నవభారత సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి కట్టుగా ఉండాలని, “””ఒక వ్యక్తి తన కోసం తాను జీవిస్తే తన జ్ఞానం అందులోనే నాశనం అవుతుందని, సమాజం కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతామని తెలియజేశారు.””” ఏరోజైతే ఒక వ్యక్తి ఆత్మ న్యూనత, ఆత్మాభిమానం చంపుకోకుండా సమాజంలో తిరగ గలుగుతాడో ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని, అంటరానితనం, కుల బహిష్కరణలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఐటి ప్రకాష్, మాజీ ఎంపీపీ బోయిడి విట్టల్, మాజీ సర్పంచ్ మీరా విజయ్ కుమార్ నాయకులు బొప్ప నాగలింగం, కందూర్ సంతోష్, జావిద్ ఖాన్, ఏక్బాలుద్దీన్, గోరేఖర్ సంతోష్, అలికే దత్తాత్రి, ఎన్నిల నాగేందర్, మహిళలు,అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కస్తూరే రాహుల్, కార్యవర్గ సభ్యులు, మహిళలు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment