విజేతకు డా. బి ఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు
విద్యా రంగంలో ఉత్తమ సేవలకు ఘన గుర్తింపు
తానూర్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 14
ఉత్తమ విద్యా ప్రమాణాలను మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు అందించడంలో విజేత హై స్కూల్ మార్గదర్శిగా నిలుస్తోంది. స్థాపించిన రెండో సంవత్సరంలోనే 400 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల, అత్యంత తక్కువ ఫీజుతో పిల్లలకు అత్యుజ్వలమైన విద్యను అందిస్తోంది. ముఖ్యంగా, ఐఐటి, నీట్, ఒలంపియాడ్ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణను అందిస్తున్నది. ప్రతి విద్యార్థి సర్వాంగ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ-చదువులో నాణ్యత, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దృష్ఠి సారించారు. టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది సమిష్టి కృషితో పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. క్రీడలు, యోగా, కరాటే, సాంస్కృతిక కార్యక్రమాల్లో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో అనేక బహుమతులు విద్యార్థుల వ్యక్తిగత నైపుణ్యాలకు, ఆత్మవిశ్వాసానికి నూతన ప్రోత్సాహం, క్రమశిక్షణ, నైతిక విలువలు, సమగ్ర అభివృద్ధికి విలువైన విద్యా విధానం ఈ అన్ని విషయాలను పరిశీలించి “Social Justice For World Human Rights Council” ఆధ్వర్యంలో నిర్వహించిన “Dr. B.R. Ambedkar Excellence Award – 2025″ను విజేత హై స్కూల్ ప్రిన్సిపల్ రాథోడ్ గణేష్ ఘనంగా స్వీకరించారు. ఈ అవార్డు అందజేసిన ప్రముఖుల్లో డా. కొప్పుల విజయ్ కుమార్ (National Chairman, Social Justice for WHRC) ఎమ్. సునీల్ కుమార్ (ఆడ్వొకేట్ & ల్యాండ్ లాయ్స్ ఎక్స్పర్ట్), డా. హిప్నో పద్మా కమలాకర్ (Hypno Psychologist), WHRC అధికార ప్రతినిధులు, అత్యుత్తమ విద్యా ప్రమాణాలు, విద్యార్థుల విజయం, తల్లిదండ్రుల సహకారం, టీచింగ్–నాన్ టీచింగ్ సిబ్బంది నిబద్ధత వల్లే ఈ ఆవిష్కరణ సాధ్యమైంది,’’ అని పాఠశాల కార్యదర్శి రమేష్ పేర్కొన్నారు.