జైపూర్ మండలంలో డిపిఓ ఆకస్మిక పర్యటన.

జైపూర్ మండలంలో డిపిఓ ఆకస్మిక పర్యటన.

జైపూర్ మండలంలో డిపిఓ ఆకస్మిక పర్యటన.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.

జైపూర్ మండలంలో డిపిఓ ఆకస్మిక పర్యటన.

జిల్లా పంచాయితీ అధికారి డి.వెంకటేశ్వర రావు జైపూర్ మండలంలోని ఇందారం, శెట్ పల్లి మరియు బెజ్జాల గ్రామ పంచాయితీలను ఆకస్మికంగా సందర్శించినారు. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి ఎక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లు లేకుండా చూసుకోవాలని, మురుగు కాలువలలో గడ్డి పెరగకుండా చూడాలని, నీరు నిల్వ లేకుండా వెంటనే తొలగించాలని, అవసరం అయిన చోట బయో లార్వా స్ప్రే చేయించాలని పంచాయితీ కార్యదర్శిని ఆదేశించారు. వాటర్ ట్యాంకులను క్లోరినేషన్ చేయించి పరిశుభ్రమైన త్రాగు నీటిని సరఫరా చేయాలని సూచించారు. అనంతరం రికార్డులు తనిఖీ చేశారు. బెజ్జాల లో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లల హాజరు పట్టికను పరిశీలించి, పిల్లలకు పౌష్టికాహారం మెన్యూ ప్రకారం అందించాలని అంగన్వాడీ టీచర్ కు సంచించారు. ప్రైమరీ స్కూల్ లో విద్యార్థుల తో మాట్లాడి మధ్యాహ్న భోజనం గురించి, తరగతుల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇట్టి పర్యటనలో డీపీవో వెంట మండల పంచాయితీ అధికారి శ్రీపతి బాపు రావు , పంచాయితీ కార్యదర్శులు ఏ.సుమన్, శ్రీమతి ఆర్ .ప్రతిభా రాణి, ఏ.రమాదే వి, ఉపాధ్యాయురాలు, అంగన్వాడీ టీచర్ మరియు గ్రామ పంచాయితీ సిబ్బంది ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment